మోదీని కలిసిన ఇళయరాజా..! 1 y ago
ప్రధాని నరేంద్ర మోదీని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. "రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను కలవడం ఆనందంగా ఉందన్నారు. లండన్ లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫోనీ నిర్వహించిన తొలి ఆసియా మ్యూజిక్ కంపోజర్ ఆయన రికార్డు సృష్టించారు. అసమాన సంగీత ప్రస్థానంలో ఇదొక చిరస్మరణీయ ఘనత. ఇళయరాజా ఓ సంగీత ఆణిముత్యం" అని మోదీ X వేదికగా ఫొటోలను షేర్ చేశారు.